About this item
Highlights
- సాయంత్రం వేళ అమ్మమ్మ కథలు చెపుతుంటే.
- 162 Pages
- Fiction + Literature Genres, General
Description
About the Book
సరికొత్త ప్రయోగం కస్తూరి కథాపర్వం.పాఠకుల్ని విస్మయుల్ని చేసే కథల సమాహారం.
Book Synopsis
సాయంత్రం వేళ అమ్మమ్మ కథలు చెపుతుంటే.. పిల్లలు చుట్టూ చేరి ఊకొడుతూ ఆనందంగా వింటారు. కమ్మగా చెవులకి వినిపించిన ఆ కథ మన మనసులో చెరగని ముద్ర వేస్తుంది. మనలోని ఊహాలోకపు తలుపులు తెరిచి స్వప్నాన్ని మన ముందు ఉంచుతుంది.బంగారపు పనికైనా గోడ చేర్పుకావాలన్నట్లు.. మంచి కథకు కూడా ప్రచారం కావాలి. దీనికి మినహాయింపు లేదు. 'కథ చెప్పటం బాగున్నా అందులో విషయం లేకపోతే తీసుకోలేం...', 'కథనం పేలవంగా సాగదీస్తే కథలవవు'... 'విషయం బాగున్నా కథ నడపటం బాగాలేకపోతే ఎంపిక కుదరదు.లా ఎన్నో విషయాలు నియమాలుగా పెట్టుకుని "కస్తూరి కథా పర్వం" కథలను ఎన్నుకున్న సంపాదకత్వం 'నిరాశవాదం సాహిత్యానికి పనికి రాదు' అని నిక్కచ్చిగా పాటించి ఈ కధల పుస్తకాన్ని మీ చేతిలో పెట్టారు. ఎంపికచేసిన కథలకు ప్రముఖ చిత్రకారులు 'బాలి' గారితో చక్కటి బొమ్మలు వేయించడం హర్షణీయం.--పద్మజ పామిరెడ్డి, కస్తూరి విజయం
Review Quotes
సరికొత్త ప్రయోగం కస్తూరి కథాపర్వం. పాఠకుల్ని విస్మయుల్ని చేసే కథల సమాహారం. ఎంచుకున్న వస్తువును కళాత్మకంగా కథనం చేయడంలో కొందరు కథకులు చూపిన కౌశలం విస్మయానికి లోను చేస్తుంది. కొన్ని కథల్లోని ప్రతీకాత్మకత ఆకట్టుకుంటుంది. చెప్పదలచుకున్న విషయాన్ని నేరుగా చెబితే అది వ్యాసం అవుతుందే తప్ప కథ కాదు. కథలో ఇంద్రజాలం ఉండాలి. ఊహకందని మలపులు, సంఘటనలు, నిర్మాణంలో కొత్తదనం ఉన్నపుడే కథలు చదివిస్తాయి. ఆలోచింపజేస్తాయి. కథలకు కేంద్రం సమాజమే. సామాజిక జీవితంలోని అనేక దొంతరలు ఇతివృత్తాలనిస్తాయి. అయితే సమాజ విశ్లేషణ, కార్యాకారణ సంబంధాల చర్చ కథ కాబోదు. ఈ విశ్లేషణ, చర్చోపచర్చలు కథనంలో అంతర్భాగంగా ఇమిడివుండవచ్చు. కానీ విశ్లేషణలు, చర్చలే అధికమయితే అది కథ కాక, వ్యాసం కాక విచిత్రంగా తయారవుతుంది. ఈ అవగాహన ఈ కథలు రాసిన వారికి ఉన్నది. కనుక ఎవరికి తోచిన పద్ధతిలో వారు తమదైన కథనరీతిని అనుసరించి కథలని సృజించారు. ఏం చెప్పాలన్నదే కాక ఎలా చెప్పాలన్నదానికి కొందరు తగిన ప్రాముఖ్యం ఇచ్చారు.విభిన్న ఇతివృత్తాలతో సాగిన కస్తూరి కథాపర్వం వైవిధ్యంగా ఉండి పాఠకుల్ని ఆలోచింపజేస్తుంది. మనుషులంతా మంచివాళ్ళనో, చెడ్డవాళ్ళనో నిర్ణయించలేము. మంచీచెడు ఒకచోట కనిపిస్తుంటాయి. వ్యవస్థలో దోషాలున్నాయి. కొన్ని సుగుణాలూ ఉన్నాయి. వ్యవస్థలో మార్పులు వచ్చాకనే వ్యక్తుల్లో మార్పులు వస్తాయనే ఆలోచన సరికాదు. వ్యక్తులు మారుతూ వ్యవస్థలో మార్పు కోసం ప్రయత్నించడం అవసరమనే అంశాన్ని అన్యాపదేశంగా నొక్కిచెబుతుందీ సంకలనం. అందుకే ఈ కస్తూరి కథాపర్వాన్ని తెలుగు సాహిత్య ప్రపంచంలోకి సాదరంగా స్వాగతం చెబుదాం.ఈ సంకలనకర్తల ప్రయత్నం అభినందనీయం.--గుడిపాటి